calender_icon.png 19 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరా జయంతి వేడుకలు

19-11-2025 05:06:59 PM

చెన్నూర్ (విజయక్రాంతి): ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలు మంచిర్యాల జిల్లా కిష్టంపేట గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్రను పెంపొందించడానికి ఇందిరాగాంధీ రూపొందించిన సంక్షేమ, ఆర్థిక కార్యక్రమాలను గుర్తు చేశారు. మహిళా సాధికారతకు మార్గదర్శకురాలైన ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.

మంత్రికి సన్మానం 

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేసినందుకు  మంత్రి వివేక్‌ ను చెన్నూరు కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని విజయోత్సహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.