19-11-2025 05:20:07 PM
మెట్మా సిఓ స్వరూప..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని గ్రామ మహిళా ఐక్య సంఘాల మెట్మ సిఓ స్వరూప పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ పట్టణంలో శివ ఏఎల్ఎఫ్ ఏరియా ఫౌండేషన్ కు సంబంధించి 18 సంఘాలకు చెందిన వంద మందికి పైగా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువతతో పాటు ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు.
అనంతరం ప్రతిజ్ఞ చేశారు. 18 మహిళా సంఘాలకు సంబంధించి 100 శాతం రుణాలు రికవరీ అయ్యాయన్నారు. మహాజన సభ సమావేశంలో ఐదుగురిని ఎన్నుకొని వారి ఆధ్వర్యంలోనే లావాదేవీలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ఉప్పు రాజమణి, కార్యదర్శి అంతటి ఉమా, కోశాధికారి మ్యాడగొని విజయ, సహాయ కార్యదర్శి కొమురవెల్లి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు కోయాడ అంజలితో పాటు ఆర్ పి పొన్నం మంజుల పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.