calender_icon.png 19 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

19-11-2025 05:22:26 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

హనుమకొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చే బీసీ రిజర్వేషన్ల బిక్షను బీసీ సమాజం అంగీకరించబోదని, బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు.

బుధవారం ఆయన హనుమకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనను రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకపోతే రాష్ట్రంలో అగ్గిపుట్టిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలలో 42 శాతం మేరకు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని, పార్టీ పరంగా ఒకవేళ ఇవ్వాలనుకుంటే తెలంగాణలో జరిగిన కులగణన ఆధారంగా 60 శాతమైన ఇస్తామని ప్రకటించాలన్నారు.