calender_icon.png 24 October, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా మహిళా శక్తి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి

23-10-2025 12:47:27 AM

-కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, అక్టోబర్ (విజయక్రాంతి): నిర్మల్ గ్రామీణ మండలంలోని నాగ్నాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల నాణ్య తపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భవన నమూనా మ్యాపులను పరిశీలించి, అవసరమైన సవరణలపై సూచనలు చేశారు.

భవన నిర్మాణం నాణ్యవంతంగా, సమయానికి పూర్తి కావాలని, సరిపడినంతమంది కూలీలను నియమించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కిం గ్కు ప్రత్యేక ప్రదేశం కేటాయించాలన్నారు. భవనం చుట్టూ హద్దుల గుర్తులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ చందు జాదవ్, డీఈ తుకారం రాథోడ్, ఏఈఈ చందన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు ప్రభాకర్, రాజు, ఎంపీడీవో గజానన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.