calender_icon.png 25 October, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యం..

23-10-2025 12:49:27 AM

-బస్సు ఎక్కిన ప్రయాణికులతో పరిచయం కార్యక్రమం

-ఆర్టీసీ సేవలపై ప్రచారం

నిర్మల్, అక్టోబర్  (విజయక్రాంతి): ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యం అంటూ ఆర్టీసీ వినూత్న రీతిలో టీజీ ఆర్టీసీలో కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు భరోసా భద్రత ప్రయాణంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీజీ ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగ డం ఆదాయ వనరులు పెరగడంతో ప్రయాణికుల భద్రతకు కూడా అత్యధిక ప్రాథమి స్తూ వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోతుంది.

మంగళవారం ఆర్టిసి ఎండి నాగిరెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ జిల్లాల్లోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న భక్తులకు ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు స్వాగతం పలికే కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఆర్టీసీ డిపోలు ఉండ గా సుమారు నిర్మల్‌లో 144, బైంసాలో 72 ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నారు. అయితే ఆర్టీసీలో విధులు నిర్వహించి కండక్టర్లు డ్రైవ ర్లు డ్యూటీ ఎక్కగానే వారు ప్రయాణించే రూట్లో బస్సులు ఎక్కిన ప్రయాణికులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు

స్వాగతం.. సుస్వాగతం అంటూ...

టీజీ ఆర్టీసీలో ప్రయాణికులకు మరింత దగ్గర ఎందుకు ఇప్పటికి ప్రతి శుక్రవారం పువ్వులు ఇచ్చి మర్యాద దినోత్సవాన్ని పాటిస్తున్న టీజీ ఆర్టీసీ అధికారులు తాజాగా ప్రతిరోజు స్వాగత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. డిపో పరిధిలోని వివిధ రూట్‌లకు వెళ్తున్న బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు డ్రైవర్లు బస్సు ఎక్కిన ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం అంటూ పరిచయ కార్యక్రమాన్ని చేసుకోనున్నారు. ఆ తర్వాత కండక్టర్ డ్రైవర్ తమ పేర్లను పరిచయం చేసుకొని ఆ సర్వీసు నిర్మల్ నుండి ప్రారంభమై ఎక్కడికి వెళ్తుంది ఏ సమయానికి వెళ్తుంది అక్కడ చేరుకోవడానికి సమయం ఎంత ఆగే స్టేజీలు టికెట్ల ధరలు ఆర్టీసీ సంక్షేమ పథకాలు తదితర వివరాలను బస్సులోనే వివరించి తర్వాత ప్రయాణం సాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

టీజీ ఆర్టీసీలో తాము ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం డ్రైవర్ అనుభవం కండక్టర్ అనుభవం తదితర అంశాలను ప్రయాణికులకు వివరించారు. ఆర్టీసీ ద్వారా అందుతున్న సేవలను ప్రయాణికులకు వివరించి ఆర్టీసీ ప్రయాణం భరోసా భద్రతతో కూడుకుందని ప్రయాణికులకు నమ్మకంగా వివరిస్తూ మీ ప్రయాణం సుఖంగా ప్రశాంతంగా నిర్వహించాలని టీజీ ఆర్టీసీ కోరుకుంటున్నారు ప్రచారం ముగించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని అన్ని సర్వీసులో ఈ కార్యక్రమం ప్రతిరోజు అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ టోల్ ఫ్రీ నెంబర్ ఇతర సేవలపై కూడా అవగాహన కల్పించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ప్రయాణికులకు పూర్తి భరోసా..

టీజీ ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులకు భద్రతా భరోసా మర్యాద కల్పించే విధంగా పరిచయ కార్యక్రమం స్వాగత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఆదేశాల బుధవారం నిర్మల్ డిపోలో కండక్టర్ డ్రైవర్లకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించి అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నాం ప్రయాణికులు కూడా తమకు పూర్తి సహకారం అందించాలి.

 పండరి, నిర్మల్ డీఎం