calender_icon.png 24 October, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహభరితంగా క్రీడా పోటీలు

23-10-2025 12:46:14 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి):  స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి హ్యాండ్ బాల్, ఖోఖో పోటీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి పోటీలకు జట్టులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి దీపక్ తివారి, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ వెంకటేష్ తెలిపారు.క్రీడలకు 300 మంది క్రీడాకారులు పాల్గొనగా  పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ఎసిఎంఓ  ఉద్ధవ్, క్రీడల అధికారి మడావి షేకు, ఏటీడీవో చిరంజీవి, క్రీడా పాఠశాల పిడి బండ మీనారెడ్డి, పిఈటిలు విద్యాసాగర్, కృష్ణమూర్తి, లక్ష్మణ్ ,సత్యనారాయణ, శారద ,హరీష్ ,యాదగిరి, సాయి, భవ్య ,సరోజ ,అరవింద్, తిరుమల్, రవి పాల్గొన్నారు.