03-07-2025 12:00:00 AM
ఖమ్మం, జులై 2(విజయ క్రాంతి): ఖమ్మం రూరల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నూతన కార్యాలయం, ఆధునీకరించిన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధితులు నిర్భయంగా పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే అనువైన పరిస్థితులు కల్పించేలా పోలీస్ స్టేషన్ లో ఉండాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డిసిపి ప్రసాద్ రావు, ఏసీపిలు తిరుపతిరెడ్డి, రమణమూర్తిపాల్గొన్నారు.