calender_icon.png 5 August, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి పశువుల సంతలో పారిశుద్ధ్య పనులు

05-08-2025 01:13:56 AM

కల్వకుర్తి, ఆగస్ట్ 4:కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పశువుల సంతలో రైతులకు మూగజీవాలకు వసతుల పేరుతో మున్సిపల్ అధికారులు రైతుల నుండి అడ్డగోలుగా డబ్బులు దండుకోవడంపై విజయక్రాంతి సోమవారం ’పశువుల సంతలో పైసా వసూల్’ అనే వార్త కథనాన్ని ప్రచురించింది.

దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి సోమవారం మధ్యాహ్నం పశువుల సంతలో రైతులకు మూగజీవాలకు వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. చాలాకాలంగా నీరు లేక నీటి తొట్లలో పాచి పేరుకుపోయి ఉందని అందులోని పాచిని తొలగించి నీటిని ఏర్పాటు చేశారు.  సంతకు ముందు నీటి కొలను శుభ్రం చేయడమే కాకుండా, శాశ్వతంగా నీటి ట్యాంకులు, చెత్త డంపింగ్ ఏర్పాటు చేయాలని రైతులు పట్టణ ప్రజలుకోరుతున్నారు.