calender_icon.png 16 August, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల నిజం చేసేందుకే ఇందిరమ్మ ఇండ్లు

16-08-2025 01:11:23 AM

  1. అన్ని రంగాలలో అగ్రగామిగా జగిత్యాల జిల్లా

నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీక రేషన్ కార్డులు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఆగస్టు 15(విజయ క్రాంతి): జగిత్యాల జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల క్ష్మణ్ కుమార్ అన్నారు. 79వ స్వాతంత్ర ది నోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జి ల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ము ఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడు తూగాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వా తంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోందని,అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించిందన్నారు. రు.13 వేల కోట్ల వ్యయం తో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వం అందించిన కొత్త రేషన్ కార్డులుప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీకగా నిలిచాయన్నారు. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. పదే ళ్ల తర్వాత చేతికి అందిన రేషన్ కార్డుతో... రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోందన్నా రు.గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశామన్నా రు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా...

రైతుల విషయంలో రాజీ పడకుం డా తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రో త్సహించామన్నారు.‘ఇందిరమ్మ రైతు భ రోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామన్నారు. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశామని, జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని తెలిపా రు.

రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మం ది రైతులకు ఈ సాయం అందించామన్నా రు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.ప్రజా ప్రభు త్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు.తొలి విడతగా ప్రతి నియోజకవర్గం లో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చే శామని, అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

ఒక్క ఏడాదిలో 4 లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నామని మంత్రి వివరించారు.స్థానిక సంస్థల్లో,విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని ,సుప్రీంకోర్టు తీర్పు నకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్- 1 లో 15, గ్రూప్-2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చామ న్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. యువతకు ఉపాధి, ఉ ద్యోగ కల్పన కోసం టీజీ పీఎస్సీ ని సంస్కరించామన్నారు.జిల్లా లోని ప్రజాప్రతినిధు లు,అధికారుల సహకారం తో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అదనపు కలెక్టర్ బిఎస్ లత, జిల్లా అధికారులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖలు ఏర్పా టు చేసిన స్టాళ్లు అలరించాయి.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 15(విజయక్రాంతి) దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీ య జెండాను ఆవిష్కరించి, వందనం చేశా రు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా పోలీసుల నుంచి గౌర వ వందనం స్వీకరించారు. అనంతరం జాతీ య జెండాను ఆవిష్కరించి, వందనం చేశా రు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సం క్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. అ నంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమా లు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి, అభినందించారు.

ఉత్తమ ప్రతిభ చూపి న విద్యార్థులను అభినందించారు.లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ జిల్లాలోని 495 మంది ముస్లిం మహిళలు, ఏడుగురు క్రిస్టియన్ మహిళలకు ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సం దీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు కలిసి పంపిణీ చేశారు.

అంబరాన్నంటిన సంబరాలు

జగిత్యాల అర్బన్, ఆగస్టు 15(విజయ క్రాంతి): 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వి ద్యాసంస్థలు, కుల సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించా రు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సత్య ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేయగా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.

జిల్లా కోర్టు సముదా యంలో న్యాయమూర్తి రత్న పద్మావతి జాతీ య జెండాను ఎగరవేశారు. స్థానిక ఇందిరా భవన్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ సంజ య్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తాసిల్ చౌరస్తా వద్ద బిజెపి నాయకు లు ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయగా పాత బ స్టాండ్ లో ఏబీవీపీ నాయకులు జాతీయ ప తాకాన్ని ఆవిష్కరించారు.

బిఆర్‌ఎస్ జిల్లా కా ర్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ ధావ వసంత ఆధ్వర్యంలో వేడుకలను ఘ నంగా నిర్వహించారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ తో పాటు జిల్లా యూనియన్ కార్యాలయం లో ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగరవేయగా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాల చారి,ఆదిల్ జిల్లా యూనియన్ నాయకులు, పాత్రికేయు లు పాల్గొన్నారు.

జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇల్లందుల రాజు, గాలి పెళ్లి గంగా ప్రసాద్, బొందుకూరి ఆగయ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉదయం నుండి పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వివిధ దేశ నాయకుల వేషధారణలతో పట్ట ణ వీధుల్లో ప్రభాతభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాడవాడలా రెపరెప లాడిన మువ్వెన్నల జెండా..

హుజురాబాద్,ఆగస్టు 15:(విజయ క్రాంతి) స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాహుజురాబాద్ నియో జకవర్గం పరిధిలో వాడవాడలా మువ్వెనల జెండా క్రవారంరెపరెపలాడింది. పలు ప్రైవే టు పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో వీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్వ తంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. పాఠశాలలో నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి.

హుజురాబాద్ ఆర్డిఓ కార్యా లయంలో ఆర్డీవో రమేష్, హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో ఏసీపి మాధవి, హు జురాబాద్ సబ్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ కుమార్, తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దార్ కనకయ్య, హుజురాబాద్ పోలీ స్ స్టేషన్లో సిఐ కరుణాకర్, హుజురాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ పులి వెంకట గౌడ్, జమ్మికుంట టౌన్ లో సిఐ రామకృష్ణ గౌడ్, జమ్మికుంట మార్కెట్లో మార్కెట్ చైర్పర్సన్ స్వప్న,సదానందం హుజురాబాద్, జ మ్మికుంట మున్సిపాలిటీలలో కమిషనర్లు స మ్మయ్య,వివిధ కార్యాలయంలో సంఘాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ము వెన్నెల జెండా ఆవిష్కరించారు.

ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలి 

మంథని, ఆగస్టు 15 విజయ క్రాంతి) ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలని మంథని లో స్వాతంత్య్ర దినోత్సవ వేడు కల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం మంథని పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ జెండా ను మంథని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, మంథని పట్టణములో టాటా ఏసీ ఆటో యూనియన్ ఆద్వర్యంలో, ఫ్రెండ్స్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర ది నోత్సవ వేడుకలు గణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీని బాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామ వీరులను స్మరించుకుంటూ, దేశ భక్తి భావనతో ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులకు శ్రీను బాబు బుక్స్ పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్ర సాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్రు ర మా, సురేష్ రెడ్డి, ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ పతి బానయ్య, నాయకులు ఒడ్నాల శ్రీనివా స్, పోలు శివ, గొటిగారి కిషన్, ఆరేళ్లి కిరణ్, మంథని శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో.. 

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 15 (విజయక్రాంతి)స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి స్వాతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు.స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసు కోవడం,భారతదేశానికి స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులను స్మరించుకోడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు.

ఎందరో మహానుభావులు త్యాగఫలమే. మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.ఈకార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు,ఆర్.ఐలు ,ఎస్.ఐ లు,పోలీస్ కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో...

కరీంనగర్ క్రైం, ఆగస్ట్15)విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యే క అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ క్లబ్ లోనూ జెండా ఎగురవేశా రు.కలెక్టరేట్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కా ర్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తా నాజీ వాకడే, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఖాళీ చరణ్, నాన్ గెజిటె డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దారం శ్రీ నివాస్ రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గంగుల కమలాకర్

కొత్తపల్లి, ఆగష్టు 15(విజయక్రాంతి ):స్వ తంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం రోజున కరీంనగర్ పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వ తంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ జెండాను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.మొదటగా బిఆర్టి యు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కాంప్లె క్స్ ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం జిల్లా పరి షత్ ఎదురుగా ఆటో యూనియన్ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తదుపరి చింతకుంట లో గల బి ఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామ కృష్ణారావుతో కలిసి జెండాను ఎగురవేసి వందనం చేశారు. తదనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తదుపరి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వాతం త్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సం దర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిందని ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక మైలురాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమల లో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా బోయినపల్లిలో 79 స్వాతంత్ర దినోత్సవం.. 

బోయినపల్లి,  ఆగస్టు 15(విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మం డలంల శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భం గా తాసిల్దార్ కార్యాలయంలో ఇంచార్జి తాసిల్దార్ భూపేష్ రెడ్డి, మండల పరిషత్ కార్యా లయంలో ఎంపీడీవో జయశీల, ఏఎంసి కా ర్యాలయంలో చైర్మన్ ఎల్లేష్, సిస్ కార్యాలయంలో డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, రైతు వేదికలో ఏవో ప్రణీత, విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ శ్రవణ్ కుమార్ కొదురు పాక బి సి ఎం కంటి దవాఖానలో పాఠశాల హెచ్ ఏం రవీందర్, పాఠశాలల్లో ప్రధాన ఉ పాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు.

రవాణా కార్యాలయంలో.. 

కొత్తపల్లి, ఆగష్టు 15(విజయక్రాంతి):79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అ థారిటీ, కరీంనగర్ జిల్లా మెంబెర్ పడాల రాహుల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ మన దేశం స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని, వారి త్యాగాలు మనకు ప్రేరణగా, వారి విలువలు మనకు మార్గదర్శకంగా ఉండాలని దేశ అభివృద్ధి,

ప్రజల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృ షి చేయాలని అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీటీసీ పురుషోత్తం ,డిటిఓ శ్రీకాం త్, చక్రవర్తి, ఎఎమ్ విఐ స్రవంతి , ఆర్ టి ఓ కార్యాలయ ఉద్యోగులు మరియు కానిస్టేబుల్లు పాల్గొన్నారు.

కోరుట్లలో..

కోరుట్ల ఆగస్ట్ 15 ( విజయ క్రాంతి) : ప ట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం, ము న్సిపల్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, మా ప్రెస్ క్ల బ్, వివిధ కుల సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 79 స్వాతంత్య్ర దినోత్వంను పు రస్కరించుకొని జాతీయ జెండా ఎగుర వేసి స్వీట్లు పంచారు. విద్యార్థులు దేశ నాయకుల వేసాదారణ లు అందరినీ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ దేశాన్ని 200 సంవత్సరాలు ఇంగ్లీసు వారు పరిపాలించారని మన దేశ నాయకుల కృషి వల్ల స్వాతంత్య్రం వచ్చిందని, దేశాన్ని అభివృద్ధి పథంలో యువత తీసుకెళ్లాలని కోరాడు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధికారులు, నాయకులు, వి ద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌లో..

ముస్తాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలంస్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మం డల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో,పాఠశాలల్లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించా రు. విద్యార్థులతో ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించి దేశ ఐక్యతను మహనీయులను స్మ రించుకుంటూ నినాదాలు చేశారు.

మండల కేంద్రంలో సేస్ కార్యాలయంలో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ మన దేశంలో విభిన్న కుల మతాలు, ఎన్నో భాషలు కలిగి ఉన్న వై విధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ హృదయ పూర్వకంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ మండల నాయకులు, మహిళ నా యకురాల్లు,  తదితరులు పాల్గొన్నారు.

ఐఎమ్‌ఏ హాల్‌లో.. 

కొత్తపల్లి, ఆగష్టు 15(విజయక్రాంతి ):క రీంనగర్ పట్టణం లోని ఐ ఎమ్ ఎ హాల్ లో ప్రెసిడెంట్ డాక్టర్ ఎనమాల్ల నరేష్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సెక్రటరీ డా ఎస్ నవీన్ కుమార్, ట్రెసారర్ డా సి హెచ్ విజయ్ కుమార్ మరియు ఐ ఎమ్ ఎ సభ్యులు పాల్గొన్నారు.