calender_icon.png 16 August, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులకు అండగా ఉంటాం

16-08-2025 12:14:32 AM

  1. అపోహలు, అనుమానాలు దాటుకుని ముందుకు వెళ్తున్నాం

పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం

పారదర్శక పాలసీలు కాంగ్రెస్ ప్రభుత్వ విధానం

వెయ్యేళ్లు చెప్పుకునేలా మేం ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం

ఫ్యూచర్ సిటీ ఫోర్ బ్రదర్ సిటీ కాదు. మీరందరూ కూడా నా బ్రదర్సే..

క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): పెట్టుబడులను ఆహ్వానించడమే కా కుండా, పెట్టుబడిదారికి లాభాలు వచ్చేలా చూడటం, ఆ పెట్టుబడులకు రక్షణ కల్పించడాన్ని తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్న దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం సీఎం క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించి మాట్లాడారు. తాను సగటు మధ్యతరగతి ఆలోచన లున్న ముఖ్యమంత్రినని, సొమ్ములు కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న దృక్పథం ఉన్న వాడిని కాదని తెలిపారు, తానెప్పుడూ సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తానని, అందుకే రియల్టర్లు అడిగిన కొన్ని పనులను నేను అంగీకరించడం లేదని స్పషట చేశారు.

కొన్ని విషయాలకు తానెప్పటికీ సహకరించనని, పారదర్శక విధానంలో ప్రజలకు మంచి చేయడం, అభివృద్ధికి బాట లు వేయడమే తన విధానమని తేల్చిచెప్పా రు. తమ ప్రభుత్వం పారదర్శక పాలసీలతోనే పెట్టుబడులను ఆహ్వానిస్తుందని, ఈ పయనంలో మేం అపోహలు, అనుమానాలను దాటుకుని ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. అపోహల్లోనే ఉంటూ, అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారి కోసం ‘క్రెడా య్’ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం అభినందనీయం’ అని ముఖ్యమంత్రి కొనియా డారు. కొందరు రాజకీయ నాయకులు సృష్టిస్తున్న వదంతులు, అపోహలు నమ్మి బిల్డర్లు, రియల్టర్లు మోసపోకూడదన్నారు.

దివంగత కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు రావాలని ఆకాంక్షించా రని, ఆయన కృషితోనే మెట్రోరైల్ వచ్చిందని కొనియాడారు. తమ ప్రభుత్వం ఎక్కువ జనసాంద్రత ఉండే శామీర్‌పేట, మేడ్చల్ వరకు మె ట్రో విస్తరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ డిజైన్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

తాము నియో పోలీస్‌కు సైతం మెట్రో డిజైన్ చేశామని, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి తాను ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ల కోసం మిలటరీ వాళ్లు ఒక్క ఇంచు భూమి ఇచ్చేందుకు అంగీకరించలేదని, అయినప్పటికీ తాను ఢిల్లీ వెళ్లి అనుమతులు తెచ్చినట్లు గు ర్తు చేశారు. నగరం ప్రతిష్ఠ పెంచేందుకే తమ ప్రయత్నాలని వెల్లడించారు.

కేంద్రం ఇప్పటివరకు మెట్రో, మూసీ సహా అనేక ప్రాజె క్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉందని, సీఎంలు స్వయంగా ఢిల్లీకి వెళ్లినా కేంద్రం  స్పందించడం లేదని వాపోయారు. తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటే విమానాశ్రయం ఉందని, పక్కనే ఉన్న మహారాష్ట్రలో 40 విమానాశ్రయాలు ఉన్నాయని, రాష్ట్రానికి కూడా మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.

తాము కేంద్రం నుంచి మెట్రోవి స్తరణ, ఎయిర్ పోర్ట్, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్‌కు అనుమతులు అడిగింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు వేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామని, అందు కు కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపించామని చేశారు.

కేంద్రం త్వరలోనే అనుమ తులు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామని వివరించారు. హైడ్రా ద్వారా రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరిస్తున్నామని వివరించారు. హైడ్రా హైదరా బాద్‌లో నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఒక పెద్దమనిషి సోషల్ మీడియా ద్వారా తమ పై దుష్ర్పచారం చేశాడని, అలాంటి దుష్ప్రచారానికి మద్దతుగా నిలిచేవారు నష్టపోక తప్పదని హెచ్చరించారు.

ఫోర్ బ్రదర్ సిటీ కాదు... 

‘కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టాడు.. ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్మించారు. హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు. వాళ్లంతా ఇప్పుడిక్కడ లేకపోయినా మనం వారి పేర్లు చెప్పుకొంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నాం. అలాగే వెయ్యేళ్ల పాటు చెప్పుకు నేలా మా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు.

ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ వంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల సమీపంలో భూములు ఉన్న వారికి లాభం జరిగి ఉండవచ్చని, కానీ.. వైఎస్‌ఆర్, చంద్రబాబు వ్యక్తిగ తంగా ఎలాంటి ప్రయోజనం ఆశించలేదని తెలిపారు. ‘ప్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని నేనంటే కొందరు ఫోర్ బ్రదర్ సిటీ అని అంటున్నారు. కానీ మీరందరూ తన సోదరులే. సంపాదించింది ఎవరైనా తీసుకెళతారే మో గానీ.. సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరు.

నాకు వేరే కోరికలేం లేవు’ అని తెలిపారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. భవిష్యత్‌లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకొనేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, తపన ఉందని, అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

భూమి ప్రతిఒక్కరికీ ఒక సెంటిమెంట్ అని, ఆ సెంటిమెంట్‌ను రియల్టర్లు ముందుకు తీసుకెళ్లా లని సూచించారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, క్రెడాయ్ కన్వీనర్ కుర్ర శ్రీనాథ్, కో- అరవింద్‌రావు మెచినేని, నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జీ రామ్‌రెడ్డి, తెలంగాణ ప్రెసిడెంట్ ఇంద్రసేనరెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ అగర్వాల్, కే అనిల్‌రెడ్డి, వై రవిప్రసాద్, కోశాధికారి నితీశ్‌రెడ్డి గూడూర్, జాయింట్ సెక్రటరీలు సంజయ్ కుమార్ బన్సాల్, శ్రీరామ్ ముసునూరు పాల్గొన్నారు. 

జల సంరక్షణతోనే హైదరాబాద్  భవిష్యత్తు: క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ క్రాంతికిరణ్‌రెడ్డి

నీటి వనరుల క్షీణత రియల్ ఎస్టేట్ రం గానికి మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడికి సంబంధించిన ముఖ్యమైన సమస్య అని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ కే క్రాంతికిరణ్‌రెడ్డి అన్నారు. నగరంలో సంప్రదాయ నీటి వనరులు, భూగర్భ జలాలు, చెరువులు అడుగంటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ ప్రవేశపెట్టిన హైడ్రా బాగా పనిచేస్తున్నదని తెలిపా రు. హైడ్రా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుం దని కొనియాడారు. స్థిరమైన అభివృద్ధి తమ బాధ్యత అని, తమ ప్రాజెక్టులలో నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, పర్యావరణ అనుకూ ల పద్ధతులను అమలు చేస్తామన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ను నీటి భద్రత ఉన్న నగరంగా తీర్చిదిద్దాలని కోరారు.

ప్రపంచ స్థాయి బ్రాండ్ ‘హైదరాబాద్’ :క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జగన్నాథ్‌రావు

ఐటీ, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదిగిందని క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జగన్నాథ్‌రావు కొనియాడారు. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ‘బ్రాండ్ హైదరాబాద్’ బలం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల మానవ వనరులు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తు న్నాయని తెలిపారు. 2024లో కొత్త గృహాల అమ్మకాల విలువ రూ.లక్ష కోట్లు దాటిందని, 2025 మొదటి అర్ధభాగంలోనూ హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

అమెజాన్ క్యాంపస్, గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉండటం గర్వకారణమన్నారు. 20 ఏళ్లలో 100 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఎ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌ను సాధించిన ప్రపంచంలోనే తొలి నగరం హైదరాబాద్ అని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న పారిశ్రామిక కారిడార్ మున్ముందు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, ఇది ఒక ప్రభుత్వ దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు.

హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం కావాలి: క్రెడాయ్ ప్రెసిడెంట్ జైదీప్‌రెడ్డి

హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధిలో రియ ల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్ జైదీప్‌రెడ్డి అన్నారు. నగరం మున్ముం దు ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రియల్ ఎస్టేట్ విషయంలో తెలంగాణ మోడల్ ఇప్పుడు దేశానికే ఒక బెంచ్‌మార్క్‌గా మారిందని కొనియాడా రు.

కాంగ్రెస్ ప్రభుత్వ సంస్కరణలు, పారదర్శకతతోనే అది సాధ్యమైం దని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి  కార్యక్రమాలకు ‘క్రెడాయ్’ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం, క్రెడాయ్ మధ్య సహకారం పె ట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోందని, అలా రాష్ట్రంలో వ్యాపారం సులభతరం అవుతున్నదని వెల్లడించారు. పరిశ్రమ అవసరా లకు ప్రభుత్వం స్పందించే తీరు, పారదర్శక విధానాలను తాము అభినందిస్తున్నామని తెలిపారు.

సర్కార్ ము న్ముం దు రాష్ట్రానికి భారీగా ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించాలని, రాష్ట్రం మరింత ఆర్థిక వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని కీలక ప్రదేశాల సుందరీకరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి ల్యాండ్ స్కేపింగ్, లైటింగ్, డిస్నీల్యాండ్ వంటి థీమ్ పార్కులకు శ్రీకారం చుట్టాలని కోరారు. విమా నాశ్రయం, మెట్రో లైన్లు, ఎక్స్‌ప్రెస్‌వే వం టి ప్ర ధాన రవాణా కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రియల్ ఎస్టేట్ కారిడార్లను అభివృద్ధి చేయాలని సూచిం చారు. అలా చేస్తే వాణిజ్య, నివాస గృహాల వృద్ధికి ప్రోత్సా హం ఇచ్చినట్లవుతుందని వివరించారు.