16-08-2025 12:43:51 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల , కళాశాలలో ఖాళీలుగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం డెమో నిర్వహిస్తున్నట్లు మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల కన్వీనర్ శ్వేత ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు సాంఘిక శాస్త్రం PGT (మహిళా)1 భౌతిక శాస్త్రంJL(మహిళ)1 గణితశాస్త్రంJL(మహిళ)1 రసాయన శాస్త్రం JL (జనరల్)1 ఆసక్తి కలిగిన అభ్యర్థులు PG,B.Ed. మరియు TET కు సంబంధించిన ఒరిజినల్ మరియు1 సెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని సూచించారు.ఈ పోస్టుల కోసం జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలల/కళాశాలలో తేదీ 18 ఆగస్టు 2025 ఉదయం 10 గంటలకు డెమోలు నిర్వహిస్తారని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల డిస్టిక్ కన్వీనర్ తెలిపారు.