calender_icon.png 16 August, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేజంగ్ల రాజ్ కళాశ భారీ ర్యాలీ

16-08-2025 12:35:30 AM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): రేజంగుల రాజ్ కళాశ యాత్ర హనుమకొండలోని నగర వీధుల్లో శుక్రవారం అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో జరిగింది. 1962లో భారత చైనా యుద్ధంలో వీరమరణం పొందిన 120 మంది యాదవ శౌర్య యోధులను స్మరించుకుంటూ జిల్లా కేంద్రంలో యాదవ సోదరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాయచూర్ జిల్లా మీదుగా తెలంగాణలో యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగానే శుక్రవారం హనుమకొండ జిల్లా కేంద్రానికి వచ్చిన యాత్రకు యాదవ సోదరులు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం నగరంలో  భారీ ర్యాలీ నిర్వహించారు.