16-08-2025 12:33:16 AM
ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో కష్టనష్టాలు భరిస్తున్నాం.. ఆ నీటిని వాడుకోవద్దా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే కష్టనష్టాలు భరిస్తున్నామని, దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని, సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర దినోవత్సవం సందర్భంగా శుక్రవారం ఏపీలోని అమరావతిలో జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అభి వృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. తాము నిర్మించతలపెట్టిన బనకచర్లతో ఏ రాష్ట్రానికి నష్టం ఉండబోదన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్ల నిధులు విడుదల చేసిం దని, వాటితో సకాలంలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.