calender_icon.png 25 September, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు

25-09-2025 12:24:14 AM

 -ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్లు పూర్తి చేసుకోవాలి

- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

- నిమ్మపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన విప్

కోనరావుపేట సెప్టెంబర్ 24 (విజయక్రాంతి):పేదవారి ఆత్మగౌరవ ప్రతీక ఇందిర మ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..బుధవారం కొనరావుపేట నిమ్మపల్లి గ్రామంలో కోనరావుపేట మండ ల పరిధిలో 18 లక్షల 31 వేల విలువైన 52 ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ము ఖ్యఅతిథిగా హాజరై లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. అనంతరం నిమ్మపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు సుంకే మాధవి ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ ను విప్ పరిశీలించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు..నిమ్మపల్లి లో 52 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయ డం జరిగిందని ఇప్పటికే నిర్మాణలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇల్లు కట్టుకు న్న వారు సంతోషంగా తాము పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు అనీ ఆనందంతో అంటున్నారని విప్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆనాడు చేసినట్లుగా నేడూ గృహ ప్రవేశ సమయంలొ నూతన వస్త్రాలు పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరం

వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారి కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్‌ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 10 సంవత్సరాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వ ఏర్పడిన నాటినుండి నేటి వరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

- చేనేత సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న విప్

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 24 (విజయక్రాంతి)చేనేత పారిశ్రామిక సహకార అభివృ ద్ధి కి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం వేములవాడ పట్టణంలో చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఉత్పత్తి &విని యోగదారుల సంఘం లిమిటెడ్ 78 వార్షిక 93 వ సర్వసబ్య సమావేశంలో రాష్ట్ర ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పా ల్గొన్నారు..వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.. నేత కార్మికులకు గడిచిన పదేళ్ల కాలంగా ఉన్న బకాయిలను ప్రజా ప్రభుత్వం విడుద ల చేస్తుందని అన్నారు. నేత కార్మికుల కోరిక మేరకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసమని అన్నారు.

నేతన్న చేయూత, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయిలు జ మ చేస్తున్నామని అన్నారు.వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2,500 మెట్రిక్ టన్నుల నూలు దారం వంద సొసైటీలకు అందించామని అన్నారు. వస్త్ర పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను పెంచేందుకు హ్యాండ్లూమ్ యూనివర్సిటీ, ఐఐహెచ్టి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.. రైతుల మాదిరిగానే నేత కార్మిక కుటుంబాలకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతన్న భీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ పథకంలో నమోదు కాబడిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.జిల్లా పరిధిలో చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ పథకం ద్వారా ఇప్పటివరకు 15.62 లక్షల మంది చేయడం జరిగిందని అన్నారు..ఆర్థిక వ్యవస్ధ ఇబ్బందికరంగా ఉన్నా పేద ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.

- ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం...

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నా రు.. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ ప ట్టణ పరిధిలోని అర్హులైన 39 మంది లబ్ధిదారులకు 13 లక్షల 21 వేల విలువ గల,అర్బన్ మండల పరిధిలో 04 లక్షల విలువ గల 18 ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం పం పిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మా ట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందు లో భాగంగా మహిళ ప్రజలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 సిలిండర్, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారి కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్‌ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు..పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు..గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహా యనిధి ద్వారా 10 సంవత్సరాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వ ఏర్పడిన నాటినుండి నేటి వరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు..