calender_icon.png 25 September, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ భవన నిర్మాణం కలేనా?

25-09-2025 12:20:30 AM

- గత ప్రభుత్వంలో 50 లక్షలు మంజూరు

- అంబేద్కర్ భవనానికి నిధుల కొరత

- మధ్యలో నిలిచిపోయిన భవనం

- సరిపడ నిధులిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయాలి

- మండల అంబేద్కర్ సంఘాల విజ్ఞప్తి

ముస్తాబాద్, సెప్టెంబర్,  (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలోముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మా ణం అసంపూర్తిగా ఆగిపోయింది. అంబేద్కర్ సంఘాల కల కలగానే మిగిలిపోయింది. వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ సంఘాల నాయకుల సలహాలు సూచనల మేరకు మండల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ మండల కేం ద్రంలో అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు.

అంబేద్కర్ సంఘాల ఆ త్మగౌరవ అభివృద్ధి,సంఘ సమావేశాలు, పెళ్లిళ్ల సౌకర్యం కోసం మండల కేంద్రంలో గత ప్రభుత్వ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబేద్కర్ భవన నిర్మాణానికి ని ధులు 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.అయితే ఆ నిధులు భవనం పూర్తి స్థాయి నిర్మాణానికి సరిపోక నిర్మాణ పను లు మధ్యలోనే ఆగిపోయాయి.ప్రస్తుతం కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అం బేద్కర్ భవనానికి సరిపడా నిధులు మం జూరు చేసి భవనాన్ని ప్రారంభించేలా మం డల కేంద్రానికి చెందిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి చొరువ తీసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించాలని దళిత సం ఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం.

 నిర్మాణం పూర్తయితే కలిగే ప్రయోజనాలు

 ఎస్సీ స్టడీ సర్కిల్ తో పాటు గ్రంధాలయం ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. దీని వలన నిరుద్యోగ యువతకు ఆర్థిక ఇబ్బందులు పడకుండా చదువుకునే అవకా శం ఉంటుంది.అలాగే ఇంటిదగ్గర స్థలం లేని పేదలు వేడుకలు జరుపుకునే అవకాశం కలుగుతుంది.అంబేద్కర్ సంఘాల మధ్య ఐక్యమత్యం కుదిరి ఇరువురి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. మహనీయుల జయంతి, వర్ధంతులు జరుపు కోవడానికి వేసులుబాటు ఉంటుంది. సంఘం సమావేశాలు జరుపుకోవడం జరుగుతుంది.భవన నిర్మాణానికి కేకే సహకరించాలి ముస్తాబాద్ మండల కేంద్రం లో దళితుల ఆత్మగౌరవ భవనం ఉండాలనే ఉద్దేశంతో సమస్యల వలయంలో ఉన్న ఈ స్థలంలో గత ప్రభుత్వంలో అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేయించడం జరిగింది.కానీ కేటాయించిన నిధులు సరిపోక భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిపివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి చొరవ తీసుకొని భవన నిర్మాణానికి సరిపడా నిధులు ప్రభుత్వం ద్వారా మంజూ రు చేయించి, దళితుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతున్నాం.

అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్