25-07-2025 01:59:16 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
శాలిగౌరారం, జులై 24 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం కేంద్రం లోని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని మండలం లో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని అవి ఏ దశలో ఉన్నాయని పంచాయతీ సెక్రటరీ లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినిల బాత్రూమ్స్,వంటగది పరిశీలించి,10 వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చిటించి వారికీ కొద్దిసేపు పాఠాలు చెప్పారు. విద్యార్థి నులకు వేడివేడి అన్న వండించాలని,ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలని కేజీబివి ఎస్. ఓ నాగరాణికి సూచించారు. అనంతరం ప్రాథమిక సహకార కేంద్రాన్ని తనిఖీ చేశారు.
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది రిజిస్టర్ను చెక్ చేసి,ఆస్పత్రిలో మందులు, ఎక్విప్మెంట్స్ కొరత ఉందా లేదా అని తెలుసుకున్నారు.పి హెచ్ సి లో ఎక్కువగా సహజ ప్రసవాలు అయ్యేటట్లు చూడాలని డాక్టర్ల కు సూచించారు.
కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్,ఆర్డీవో అశోక్ రెడ్డి,ఏ డీ ఏ జానకి రాములు,ఎంపీడీవో జ్యోతిలక్ష్మి,తహసిల్దార్ జమీరుద్దీన్,ఏ వో సౌమ్య శృతి,మండల వైద్యాధికారినులు శ్వేత, సూర్య శిల్ప,సెక్రటరీ లు ఎంపిడివో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.