calender_icon.png 5 August, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టుకు మంత్రి సీతక్క

25-07-2025 01:59:55 AM

  1. కరోనా సమయంలో ‘ఆరోగ్యశ్రీ’ ధర్నా
  2. కేసులో విచారణకు హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): మంత్రి సీతక్క  నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురు వారం హాజరయ్యారు. 2021 ఆగస్టు 26న కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎన్‌ఎస్‌యూఐ  నాయకులతో కలిసి సీతక్క ప్రజారోగ్య ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు చికిత్స అందించాలని, ఉచిత అంబులెన్స్ సేవలు ఏర్పాటు చే యాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి ఆసుపత్రు ల్లో కట్టిన బిల్లులను సీఎంఆర్‌ఎఫ్ కింద చెల్లించాలని కోరారు. అయితే, కొవిడ్ సమయంలో గుంపులుగా బయట తిరగడాన్ని నిషేధిస్తూ ఆంక్షలు అమల్లో ఉన్న ప్పటికీ, ఆమరణ దీక్షలో పాల్గొన్నందుకు మంత్రి సీతక్కపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సీతక్క నాంపల్లిలోని ప్ర జాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఆగస్టు 13కి వాయిదా వేసింది.