calender_icon.png 3 July, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి

03-07-2025 02:32:53 AM

కలెక్టర్ ఆశిష్ సా0గ్వాన్ 

కామారెడ్డి, జూలై 2 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను  త్వరగా  నిర్మించుకోవాలని  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం  జిల్లా కలెక్టర్ కామరెడ్డి పట్టణ పరిధిలోని  13వ వార్డు టేక్రీయల్ లో  ఇద్దరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించి  ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదవారు కూడా గౌరవంగా సొంత ఇంటిలో నివసించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గృహనిర్మాణ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యతగా త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు.

అలాగే ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకొనుటకు లబ్ధిదారులకు సహకారం అందించాలని హోసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ అధికారులు,  మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.