03-07-2025 02:31:33 AM
కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి);, కామారెడ్డి జిల్లా కార్యాలయంలో పనిచేసిన ఏ ఆర్ డి ఎస్ పి యాకూబ్ రెడ్డి బదిలీ అయ్యారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదరపేసి నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో ఏ ఆర్ డి ఎస్ పి గా అత్యుత్తమ సేవలు అందించారని కొనియాడారు.
పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో, పోటీ పరీక్షల సందర్భంలో భద్రత ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించారని అన్నారు. విధుల్లో శ్రద్ధ, నిబద్ధత, అంకిత భావం పోలీస్ విభాగానికి మంచి పేరు తెచ్చేయడానికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, పి సి ఆర్ సి ఐ శ్రీధర్, ఆర్ ఐ లు, ఎస్త్స్రలు తదితరులు పాల్గొన్నారు.