07-05-2025 12:00:00 AM
అర్హుల ఎంపిక ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మే 6 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన ప్రాథమిక జాబితాలులో ఉన్న పేర్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని కే.ఆర్.కే కాలనీ, రామ్ నగర్, భాగ్యనగర్ లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల దరఖాస్తులను క్షేత్ర స్థాయి లో బుధవారం ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను, ఆయన పరిశీలించారు.
ఈ సందర్భం గా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. అన్ని కోణాల్లో పరిశీలించి లబ్ధిదారుల జాబితాలను తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
అంతకుముందు గూగుల్ మీట్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించి మొత్తం 6,886 అప్లికేషన్ల ధృవీకరణ పూర్తయిందన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించారు. వారు అర్హులని తేలితే ప్రతిపాదనల్లో ప్రతిపాదనల్లో చేర్చాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ సీవీయన్ రాజు, మున్సిపల్ సిబ్బంది, వీఆర్వో, తదితరులు ఉన్నారు.