calender_icon.png 28 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూముల గుర్తింపు

28-08-2025 08:35:48 PM

ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రథమ ప్రాధాన్యం

ఎమ్మెల్యే మురళి నాయక్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఆ భూమిని ప్రజల సహకారంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అవసరమైన భూమిని గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదిక అందించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అనంతారం, శనిగపురం, మల్యాల గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను అధికారులతో కలిసి గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు.