calender_icon.png 28 August, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

28-08-2025 08:29:27 PM

జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ల జాబితా వార్డుల వారీగా ప్రచురించడం జరిగిందని, మండల కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రచురించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్(District Panchayat Officer Bikshapathi Goud) ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తెలియపరచాలని, ఈనెల 31వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి సెప్టెంబర్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితా నేపథ్యంలో ఈనెల 29వ తేదీన జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, 30వ తేదీన మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.