28-08-2025 08:31:58 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో సంచరిస్తున్న కోతుల బెడదను అరికట్టాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్(Municipal Commissioner Chintha Srikanth)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కాశబోయిన సారయ్య మాట్లాడుతూ, పట్టణంలో కోతుల సంచారం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారని, ఇంట్లో పనులు చేసుకోవాలన్న, వ్యక్తిగత పనుల నిమిత్తం మార్కెట్ కు వెళ్లి ఇంటికి వచ్చేంతవరకు భయం భయంగా వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి కోతుల బెడదను అరికట్టాలని కోరారు. స్పందించిన కమిషనర్ ఈ వారం రోజుల్లో కోతులను పట్టేందుకు టెండర్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, సిపిఐ ఇల్లందు పట్టణ మండల కార్యదర్సులు బాస శ్రీనివాస్, బొప్పిశెట్టి సత్యనారాయణ, సిపిఐ నాయకులు ఉడుత ఐలయ్య, జె. మోజేసే, నిమ్మల రాము, ఆలెం రాఘవేందర్రావు, బొల్లి కొమరయ్య, దారావత్ రాందాస్, కల్తీ రామ్మూర్తి, కొత్తపెళ్లి సాంబమూర్తి, కే పీరయ్య, కే రాజయ్య తదితరులు పాల్గొన్నారు.