28-08-2025 08:24:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల వార్త ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఏ సహాయం కావాలన్నా అయ్యప్ప సేవా సమితి(Ayyappa Seva Samithi) స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచిత సేవా కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు. గురువారం పట్టణంలోని వివిధ వార్డులో ప్రజలకు ఆహార పొట్లాలు, నీళ్ల పొట్లాలు అందించడం జరిగిందన్నారు. అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బద్రి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కనపర్తి విగ్నేష్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇండల్లోకి నీరు చేరి వంట చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి పాలు, టిఫిన్స్, అందించేందుకు అయ్యప్ప సేవా సమితి అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే 9989241117, 9666281117, 9951252949 నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సాయినాథ్ సాదం ఆనంద్ పూదరి జనార్ధన్ యువరాజ్ గజేందర్ రాజు తదితరులున్నారు.