28-08-2025 08:26:28 PM
ఏనుగుల రాకేష్ రెడ్డి
హనుమకొండ (విజయక్రాంతి): రాజకీయ పార్టీలలో చేరి పదవులతో పాటు కావలసినంత డబ్బు సంపాదించాడని పార్టీలకు ద్రోహం చేసే క్యారెక్టర్ ఉన్నోడు కడియం శ్రీహరి అని కట్లపాము లాంటోడని టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి(Anugula Rakesh Reddy) మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరికి అరుదైన గౌరవం లభించిందిని ఎంపీ, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రిగా పదవులు అనుభవించి కన్నతల్లి లాంటిది బిఆర్ఎస్ పార్టీని ద్రోహం చేసి పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. విజయక్రాంతి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ, కడియం శ్రీహరి అక్రమంగా దాచిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టుకున్నాడని ఆరోపించారు. కడియం శ్రీహరిని ప్రజలు, రాజకీయ పార్టీల్లో ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మే పరిస్థితిలో లేరని ప్రజలు, తరిమి కొడతారని విమర్శించారు.