calender_icon.png 8 May, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన బార్ లబ్ధిదారుడి ఎంపిక

07-05-2025 12:00:00 AM

మంచిర్యాల, మే 6 (విజయక్రాంతి) : జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో మూతబడిన బార్ స్థానంలో నూతన బార్ ఏర్పాటుకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధి దారున్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో గతంలో మూతబడిన బార్ స్థానంలో నూతన బార్ ఏర్పాటుకు నిర్వహించిన డ్రా లో గండ్ర దీక్షితులు లబ్దిదారుడిగా ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ లక్కీ డ్రా లో ఆబ్కారీ శాఖ పర్యవేక్షకుడు నందగోపాల్, ఎక్సైజ్ సి.ఐ. గురువయ్య, సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.