calender_icon.png 28 August, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ..

28-08-2025 08:47:35 PM

చివ్వెంల: మండలంలోని ఐలాపురం, ఆంగోత్ తండ, గుర్రం తండాలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(AICC member Ramreddy Sarvotham Reddy) ముఖ్య అతిధిగా హాజరై అర్హులందరికీ ఇళ్ల పట్టాలను, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా అందిస్తామని, పట్టాలు తీసుకున్నవారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధారావత్ వీరన్న నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, డిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, చింతమల్ల రమేష్, సీనియర్ నాయకులు సామ బాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ బోడపట్ల సునీత శ్రీను తదితరులు పాల్గొన్నారు.