calender_icon.png 25 August, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్శిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల పరిశ్రమ సందర్శన

25-08-2025 01:04:56 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 24 : అనురాగ్ యూనివర్శిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభా గం ఫైనల్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులు సుల్తాన్ పూర్ లోని లియోఫిలైజేషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను సందర్శించారు. అనురాగ్ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ అలియన్స్ మరి యు ఐ.ఎస్.టి.ఈ మెకానికల్ విభాగ స్టూ డెంట్ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన పరిశ్రమ సందర్శనలో విద్యార్థులు రిఫ్రిజిరేషన్ లో నిర్మాణ పద్ధతులపై ప్రాయోగిక అవగాహన పొందారు.

ప్లాంట్ డైరెక్టర్ కె. రమేష్ బాబు అన్ని దశలను వివరంగా వివరించారు. ఈ సందర్శనను అధ్యా పకులు జి. అరుణ్ రెడ్డి, టి.న్. రవికాంత్, డాక్టర్ జష్ కుమార్ లు సమన్వయం చేశా రు. ఈ అవకాశం కల్పించిన డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వి. విజయ్ కు మార్, అసోసియేట్ డీన్ మరియు మెకానికల్ విభాగ అధిపతి డాక్టర్ కె. శ్రీనివాస చల పతి, అనురాగ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్, లియోఫిలిజేషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ కు విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు.