calender_icon.png 25 August, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలె

25-08-2025 01:07:55 AM

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, ఆగస్టు 24: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చేవెళ్ల పార్టీ ఆఫీసులో షాబాద్ మండలం సర్దార్ నగర్ కుర్వగూడ ఎంపీటీసీ బంగరంపల్లి వనిత వెంకటేశ్ ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. పాతకొత్త కలిసి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం వరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మున్సిపల్, మండల అధ్యక్షులు అనంత రెడ్డి, శ్రీకాంత్ తదితరులుపాల్గొన్నారు.