calender_icon.png 12 July, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాసంస్థల అధినేత కె ఎల్ ఆర్ చిరస్మరణీయుడు

12-07-2025 04:28:26 PM

రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రముఖ విద్యావేత్త కేఎల్ఆర్ మరణించినా, వేలాదిమంది విద్యార్థుల్లో చిరస్మరణీయుడని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కేఎల్ఆర్ విద్యాసంస్థల ఫౌండర్, చైర్మన్ డాక్టర్ కాటిరెడ్డి లక్ష్మారెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా కాంట్రాక్టర్స్ కాలనీలోని ఫార్మసీ కళాశాలలో కె ఎల్ ఆర్ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. కేఎల్ఆర్ సతీమణి నాగమణి, కుమారుడు సిద్ధార్థ, కుమార్తె సింధు, మేనల్లుడు మధుసూదన్ రెడ్డి, సోదరులు శంకర్ రెడ్డి, గోవిందరెడ్డి లను పరామర్శించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన వ్యక్తి కెఎల్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాల్వ భాస్కరరావు, కాల్వ ప్రకాష్ రావు, రియాల్టర్ మురళి, తదితరులు పాల్గొన్నారు.