3 May, 2026 | 6:11 PM

కోతులు పారిపోయేందుకు వినూత్న రీతిలో కొండెంగ వేషధారణ

03-05-2026 04:47 PM

సుల్తానాబాద్లో కోతులు పారిపోయేందుకు వినూత్న రీతిలో కొండెంగ వేషధారణ లో యువకుడు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కోతులు పారిపోయేందుకు గాను ఒక యువకుడు వినూత్న రీతిలో కొండెంగ వేషధారణ డ్రెస్ వేసి కోతులను తరిమి వేయడం జరిగింది, ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ 12వ వార్డు పరిధిలోని రాజీవ్ రహదారి, స్వప్న కాలనీ, టౌన్ షిప్, సాయిబాబా టెంపుల్, జవహర్ నగర్ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కోతుల బెడద  అధికంగా ఉండడముతో 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అమిరిశెట్టి శ్రావణి రాకేష్, మాజీ వార్డు సభ్యులు అమిరిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాలలో కోతులను తరిమికొట్టెందుకు ఒక యువకుడికి కొండేంగా వేషాధరణ డ్రెస్ వేసి కోతుల ను తరిమి వేయడము జరిగింది.. ఈ కార్యక్రమం లొ  మాజీ ఎంపిటిసి అమిరిశెట్టి రాజలింగం, మాటేటి సంజీవ్, వినయ్, ఎండి, నయీమ్, టింకు, దొడ్ల సందీప్, పుప్పాల సురేష్,  నోముల రాకేష్, లక్ష్మణ్, కుమార్, స్వామి, చైతన్య, సమీర్, కొలిపాక రాజకుమార్, జూపాక కుమార స్వామి, సాయి, రాహుల్, శ్రీనివాస్ , కాలనీ కి చెందిన మహిళలు యూవకులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు...