calender_icon.png 8 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ కి.. వర్ధంతితో వినూత్నమైన నిరసన..

06-08-2025 11:53:28 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఉద్యోగాల విషయమై బుధవారం నిరుద్యోగ యువకులు వినూత్నమైన నిరసనను తెలిపారు. పట్టణంలోని అశోక్ నగర్ లో తెలంగాణ ఉద్యమ క్యాలెండర్ 2024-25 జననం 02-8-2024, మరణం 02-8-2024 ప్రథమ వర్ధంతి నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25 జననం 02-8-2024, మరణం 02-8-2024, మరణం 02-8-2024 ప్రథమ వర్ధంతి రాసి ఉన్న చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయలు కొట్టి వర్ధంతిని నిర్వహించారు. ఈ చిత్రం వాట్సాప్ గ్రూపులో వైరల్ అయింది. తెలంగాణ ఉద్యమ క్యాలెండర్ వర్ధంతి నిరసన బెల్లంపల్లిలో చర్చనీయాశంగా మారింది.