07-08-2025 12:00:00 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు సెప్టెంబర్ నెలాఖరు లోపు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పని సరిగా అమర్చుకోవాలని రవాణాశాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తీసుకున్న అన్ని వాహనాలకు కూడా నంబర్ ప్లేట్లు బిగించుకోవాలని సూచించింది.
వాహనదారులు ఆర్టీఏ సూచన మేరకు నంబర్ ప్లేట్ బుకింగ్ కోసం వాహనదారులు వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తే, అది కాస్తా పనిచేయడం లేదు. అలాగే 2014కు ముందున్న తీసుకున్న వాహనాలన్నింటికీ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈ నంబర్లకు తెలంగాణ చిరునామా ప్రకారం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల కోసం ప్రయత్నిస్తే, వెబ్‌సైట్‌లో ఆ అవకాశం లేకపోయింది.
వెబ్‌సైట్‌లో ‘ఏపీ వెహికిల్ నంబర్’ ఎంటర్ చేస్తే ‘అదర్ స్టేట్ నెంబర్’గా అని రిజెక్ట్ చేస్తున్నది. దీంతో విసిగి వేసారి వెబ్‌సైట్ నుంచి కాకుం డా నేరుగా షోరూం నుంచి నంబర్ ప్లేట్ తీసుకుందామని వెళ్తే, అక్కడ వారు నంబర్ ప్లేట్‌కు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఇవన్నీ కాక హెచ్‌ఎ స్‌ఆర్‌పీ లేని వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. వాహనానికి అన్ని రకా ల అనుమతులున్నా, నంబర్ ప్లేట్ పాతది కావడంతో వాహనదారులు చలాన్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కొత్త నంబర్ ప్లేట్లు ఎందుకంటే..
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) బిగించుకుంటే వాహనానికి భద్రత ఉంటుందని ఆర్టీఏ అధికారులు చెప్తున్నా రు. హెచ్‌ఎస్‌ఆర్‌పీలు శక్తిమంతమైన అల్యూమినియంతో తయా రు చేసినవి కావడంతో, దానిని ట్యాంపర్ చేసేందుకు వీలుండ దు. ప్లేట్ ఎప్పటికీ తుప్పు పట్ట దు. పైగా ప్లేట్‌పై హాట్ స్టాంప్డ్ క్రోం హోలోగ్రామ్ ఉంటుంది. ప్రతి ప్లేట్‌కు ప్రత్యేకమైన తొమ్మిది అక్షరాల లేజర్ ఎన్‌గ్రేవ్డ్ కోడ్ కూడా ఉంటుంది.
ఇది సెంట్రల్ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉండటంతో వాహన ట్రాకింగ్ సులభం. అదీ కాక రాష్ట్రంలో వాహన నంబర్ ప్లేట్లన్నీ ఒకే రీతిన ఉంటాయి. ప్లేట్‌పై ఐఎన్‌డీ అన్ని చిన్న అక్షరాలతో ఉండటంతో పాటు రాష్ట్రం, ఆర్టీవో కోడ్ సులభంగా తెలుస్తా యి. రెట్రో రిఫ్లెక్టివ్ ప్లేట్ కావడం తో రాత్రిళ్లు వెనుక నుంచి వాహనంపై లైట్ పడితే.. స్పష్టం గా నెంబర్ ప్లేట్ కనిపించేలా డిజై న్ ఉంటుంది.
ఈ ప్రత్యేకతలన్నీ వాహన చోరీలను అరికట్టేందుకు ఉపయోగపడతాయి. వాహనం అపహరణకు గురైతే ట్రాఫిక్ పోలీసులు సులభంగా వాహనాన్ని గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. నకిలీ నెంబర్ ప్లేట్ల మోసాలకు సైతం అవకాశం ఉండదు. సెంట్రల్ వాహన్ డేటాబేస్‌లో లింక్ అవడంతో వెహికిల్ హిస్టరీని సులభంగా ట్రాక్ చేయవచ్చు.
పొందే విధానం..
హెచ్‌ఎస్‌ఆర్‌పీ నెంబర్ ప్లేట్ బుక్ చేసుకునే వారు https://www.siam.in/ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. బుక్‌హెచ్‌ఎస్‌ఆర్‌పీ అనే చోట క్లిక్ చేయాలి. అక్కడ వాహన వివరాలు ఎంట ర్ చేయాలి. వివరాల ఆధారంగా తగిన ఫీజు చెల్లిస్తే నంబరు ప్లేటు మనం ఎంచుకున్న చిరునామాకు చేరుకుంటుంది. ఆ తర్వాత దాన్ని మన వాహనానికి బిగించుకుంటే సరిపోతుం ది. బిగించిన ఫొటోను మళ్లీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ద్విచక్రవాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్‌ఎస్‌ఆర్పీ బిగించే సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. దీని కోసం వినియోగదారుల నుంచి కంపెనీలు నిర్ణీత రుసు ము వసూలు చేసేందుకు అవకాశం ఉంది. నంబర్ ప్లేట్ల ధరలు డీలర్ల వద్ద కనిపించేలా ప్రదర్శించాలి. ఒకవేళ ఇంటికి వెళ్లి బిగించాల్సి వస్తే అదనంగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఆర్టీఏ నంబర్ ప్లేట్ లేకుంటే వాహనం ఇతరులకు విక్రయించడం సాధ్యం కాదు.
ఆర్టీఏ అధి కారులు ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయబోరు. సదరు వాహనదారులకు బీమా, కాలు ష్య ధ్రువపత్రాలు జారీకావు. సెప్టెంబర్ 30 తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకుంటే కచ్చితంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికితే వాహనా న్ని వారు పోలీస్ స్టేషన్‌కైనా తరలిస్తారు, లేదం టే వాహనదారుడికి జరిమానా విధిస్తారు. ఇది ఒక్కసారితో అయిపోయే వ్యవహారం కా దు. నంబర్ ప్టేల్ లేకుండా ట్రాఫిక్ పోలీసుల కంటపడినప్పుడల్లా ఇదే మళ్లీ జరుగుతుంది.
ఏపీ వాహన నంబర్లకు నో ఎంట్రీ..
ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు వెబ్‌సైట్‌లో హెచ్‌ఎస్‌ఆర్‌పీకి ఆప్షన్ లేదు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని మలక్‌పేటకు చెందిన భాస్కర్ అనే వాహనదారుడు ‘విజయక్రాంతి’కి తెలిపారు. ఇదే అంశంపై ఆర్టీవో అధికారులు సైతం త్వరలో వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తామని చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.
ఇక సమీపంలోని ఓ బైక్ షో రూంను సంప్రదిస్తే రెట్టింపు ఛార్జీలు అడుగుతున్నారని తెలిపారు. దీనిపై ఆర్టీఏ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం గడువు ముంచుకు వస్తుంటే ప్రభుత్వం వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయకపోవడం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు.
ప్లేటు బుకింగ్ ఛార్జీలు
వాహన రకం ఛార్జీ (రూ.లలో)
ద్విచక్ర వాహనం 320 380
దిగుమతి చేసుకున్న బైక్స్ 400 500
కార్లు 590 - 700
దిగుమతి చేసుకున్న కార్లు 700 -- 800
ఆటోలు 350 - 450
వాణిజ్య వాహనాలు 600 - 800