31-01-2026 07:45:04 PM
ఎన్నికల పరిశీలకులు కాత్యాయని దేవి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు కాత్యాయని దేవి సూచించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏనుగొండ లో మున్సిపల్ డివిజన్ కార్యాలయం, భూత్పూర్ మండలం అమిస్తాపూర్ లో గల దయానంద విద్యా మందిరం పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రిటికల్ పోలింగ్ కేంద్రాల లొకేషన్ ను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, మైక్రో ఆబ్జర్వర్ లను నియామకం చేసి పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రం లొకేషన్ లో పోలీస్ అధికారులు శాంతి భద్రతల సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో డిఎస్డిఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.