calender_icon.png 12 July, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ గ్రౌండ్ పనుల పరిశీలన

12-07-2025 12:00:00 AM

మణికొండ, జూలై 11: మున్సిపాలిటీ పరిధిలో ఉన్న క్రికెట్ గ్రౌండ్ లో అసంపూర్తి పనులను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్,డిఈ శివ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొండకళ్ళ నరేందర్ రెడ్డి లు పరిశీలించారు. క్రికెట్ గ్రౌండ్ పనులన్నీ త్వరగా పూర్తి చేసి మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులను స్థానిక నాయకులు కోరారు.

దీనికి స్పందించిన అధికారులు క్రీడాకారుల సౌకర్యం దృష్టిలో పెట్టుకొని త్వరలోనే గ్రౌం డ్ లో అసంపూర్తి పన్ను పూర్తి చేస్తామని వారు హామీనిచ్చారు.కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఈ శివ సాయి , మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకళ్ళ నరేందర్ రెడ్డి, శానిటేషన్ సిబ్బంది రాజశేఖర్, నవజాతి యువ జన సంఘం జనరల్ సెక్రటరీ కె.మధుసూదన్ రెడ్డి, బి. తిరుమలేష్, ఎం.లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.