12-07-2025 12:00:00 AM
మేడిపల్లి జూలై 11; మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి మండల బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 63 లోగల అసైన్డ్ భూములను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సర్వే నెంబర్ 63 లో గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేడి పల్లి తహసిల్దార్ హసీనాను ఆదేశించారు. వారితోపాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.