11-07-2025 11:42:48 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు(సుల్తానాబాద్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక పీహెచ్ఓ ప్రతిభ, ఎంపీహెచ్ఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య చికిత్స పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో సాధారణ జబ్బు ఉన్న విద్యార్థులకు మందులు, మాత్రలు ఇచ్చి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. ఇందులో ఎంపీహెచోఏ రామచంద్ర, కృష్ణవేణి, స్టాఫ్ నర్స్ భాను, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.