calender_icon.png 23 August, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడవటంచ ఆలయ పనుల పరిశీలన

23-08-2025 05:26:17 PM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

రేగొండ (విజయక్రాంతి): మండలంలోని కొడవటంచ గ్రామంలో భక్తుల కష్టాలను తీర్చి, కోరిన వరాలను ప్రసాదించే కొంగు బంగారంగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పరిశీలించారు. ఆలయ గర్భగుడితో పాటు ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సదరు గుత్తేదారు, కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు. అన్ని పనులను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యే బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

పరామర్శ..

మండలంలోని గూడెపల్లి గ్రామానికి చెందిన సిరికొండ అమృతారావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. వారి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.