23-08-2025 05:24:40 PM
చేగుంట,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు, చేగుంట మండలంలోని వివిధ పాఠశాలలో సిపిఎస్ రద్దు కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించిన తపస్ సంఘ నాయకులు, అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీకాంత్ కి సిపిఎస్ రద్దు కోరుతూ వినతిపత్రం అందజేశారు. పత్రికా విలేకరుల సమావేశంలో తపస్ మండల శాఖ అధ్యక్షులు రావుల వెంకటేష్, ఉపాధ్యక్షులు మధునాల శ్రీనివాస్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాతపెన్షన్ పునరుద్ధరించాలని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా, సీపీఎస్ ఉద్యోగుల కష్టాలు తొలగి పోతాయన్నారు.
సీపీఎస్ రద్దుచేసి, పాతపెన్షన్, కల్పిస్తారనే ఉద్దేశంతో వేలాది మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, నూతనంగా ఏర్పాటు చేయబడిన తెలంగాణ రాష్ట్రంలో పాతపెన్షన్ అమలు చేస్తారా? లేక నూతన పెన్షన్ విధానంలోనే కొనసాగు తారా అంటూ అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఒక లేఖ రాసింది.
అప్పటి ప్రభుత్వం నూతన పెన్షన్ విధానంలోనే తాము కొనసాగుతామంటూ పిఎస్ఆర్డీఎతో ఒప్పందం చేసుకుందని, తెలంగాణలోని ఏ ఒక్క ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాన్ని సంప్రదించకుండానే తెలంగాణ సీపీఎస్ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానంలోనే కొనసాగుతారంటూ 2014 ఆగస్టు 23న జీవో ఎంఎస్ నెం.28 ఇచ్చి సీపీఎస్ ఉద్యోగులకు ఉరితాడు వేసింది అని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల పాలిట శాపం గా మారిన జీవో నెం.28 రద్దుచేసి,నేటి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ను పునరుద్ధరించాలని వారు కోరారు.