23-08-2025 05:28:31 PM
భారీ ఎత్తున చిక్కిన ప్రామిసరీ నోట్లు బ్లాంక్ చెక్కులు స్థిరాస్తి డాక్యుమెంట్లు
నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని వడ్డీ వ్యాపారుల ఇండ్లపై శనివారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సంఘటన వడ్డీ వ్యాపారుల వెన్నులో వణుకు పుట్టించింది. అధిక వడ్డీలు మాఫియాను వెంటబెట్టుకొని అప్పులు తీసుకున్న వారిని విపరీతంగా వేధింపులకు పాల్పడుతుండడం వల్ల వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ దాడులకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మొదలైన ఈ దాడులు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. వడ్డీ వ్యాపారుల తవరాలలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండడంతో వడ్డీ వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. గతంలో పోలీసులు దాడులు జరిపినప్పటికిని కొందరు వడ్డీ వ్యాపారులు తప్పించుకున్నారు.
ఈ నేపథ్యంలో పకడ్బందీగా శనివారం తెల్లవారుజామునుండే పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు వడ్డీ వ్యాపారుల స్థానాలపై దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు గట్టి నిఘా పుట్టిన పోలీసులు వారికి అందిన అందిన పక్కా సమాచారం మేరకు వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు జరిపారు. నిజామాబాద్ డిచ్పల్లి బోధన్ ఆర్మూర్ తదితర ప్రాంతాలలో కూడా పోలీసులు దాడులు జరిపి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడులలో పోలీసులు సఫలికృతులయ్యారు భారీ ఎత్తున నగదు ప్రామిసరీ నోట్లు అగ్రిమెంట్ కాపీల తోపాటు బ్లాంక్ చెక్కులు పెద్ద ఎత్తున పోలీసుల చేజిక్కినట్టు తెలుస్తోంది.