calender_icon.png 8 December, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సామాగ్రి పరిశీలన

08-12-2025 05:01:21 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ సామాగ్రిని సోమవారం మండల అధికారులు పరిశీలించారు. సుమారు 168 పోలింగ్ కేంద్రాలకు గాను కావలసిన అన్ని రకాల సామాగ్రిని ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖానాపూర్ ఎంపీడీవో రోమాకాంత్ సూచించారు. సమాగ్రి పంపిణీ 10వ తేదీ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సిహెచ్ రత్నాకర్ రావు, సిబ్బంది ఉన్నారు.