14-03-2025 12:00:00 AM
నాగల్ గిద్ద, మార్చి 13 : నాగల్ గిద్ధ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రంగా 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏర్పాటు మౌలిక వసతులు పరిశీలించిన నాగల్ గిద్ద మండలం విద్యాధికారి మన్మధ కిషోర్ పరిశీలించారు. మండలంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ హాల్ టికెట్లు అందించారు.
పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కోసం నాగల్ గిద్ధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిశీలించారు. గురువారం విజయ క్రాంతి పత్రికలో ప్రచురితమైన మూత్రశాల, మరుగుదోడ్లకు తాళం..? ఇబ్బందులు పడుతున్న బాలికలు అనే వార్త ప్రచురితం కావడం తో మండల విద్యాధికారి మన్మధ కిషోర్ స్పందించి పాఠశాల పరిశీలించారు.
పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లకు తాళం లేకుండా ప్రతి విద్యార్థి వినియోగించే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులు శంకర్ కు ఎంఈఓ మన్మధ కిషోర్ సూచించారు. పదవ తరగతి పరీక్ష నిర్వహణ మౌలిక వసతులు పరిశీలించరు . వారితోపాటు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శంకర్, రవీందర్ రావు, హిరమన్,మండల సిఆర్పిలు ఉన్నారు.