14-05-2025 01:01:51 AM
ఎల్బీనగర్, మే 13 : హయత్ నగర్ డివిజన్ లో ఉంటున్న సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమంగా దాచిన బుల్లెట్లతోపాటు భారీగా అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట పట్టణంలో ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో నిందితుడ్ని రిమాండ్కు తరలించకుండా ఉండేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఆయన ఇంట్లో సంచలనం కలిగించే విషయాలు బయట పడ్డాయి.
అవినీతి కేసు విచారణలో భాగంగా.. రంగారెడ్డి జిల్లా .. బాగ్‌హయత్‌నగర్ పరిధిలోని దత్తాత్రేయ నగర్‌లో నివాసం ఉంటున్న డీఎస్పీ పార్థసారథి ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ సిటీ రేంజ్- 2 ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌సీహెచ్.మురళీమోహన్‌ఆధ్యర్యంలో సోదాలు చేపట్టారు. సోదాల్లో అక్రమంగా నిల్వచేసిన 21బుల్లెట్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్ల స్టాండ్ చూసి అవాక్కయ్యారు.
ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా భారీగానే గుర్తించినట్లు తెలుస్తోంది. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌మురళీ మోహన్ సూర్యాపేట సబ్‌డివిజన్‌డీఎస్పీగా విధులు నిర్వ హిస్తున్న పార్థసారథి, ఆయనతో పాటు అక్కడే పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తూ ఏసీబీకి చిక్కిన పి.వీరరాఘవులు అవినీతి వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టారు. అక్రమంగా దాచిన బుల్లె ట్లు, కాట్రిడ్జ్‌లు పట్టుబడడంతో హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు.