calender_icon.png 21 November, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి శ్రీసరస్వతి శిశు మందిర్ లో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు

16-08-2024 02:32:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం మహిళలు శ్రావణ వరలక్ష్మి వ్రతాలను వైభవంగా జరుపుకున్నారు. విభాగ్ అకాడమిక్ ఇంచార్జి పూదరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సూరం లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానాచార్యులు ఇంగు భాగ్యలక్ష్మి ల ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాల ఏర్పాట్లు చేశారు. 64 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాతృభారతి సభ్యులు లలితా మారు, పల్లెర్ల సింధు, రాజేశ్వరి, కల్పన లతో పాటు పాఠశాల ఆచార్య బృందం, ప్రబంధ కారిణిలు పాల్గొన్నారు.