calender_icon.png 19 December, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

హైదరాబాద్‌లో ఇన్‌స్టా మీట్ 8.౦

15-12-2025 12:00:00 AM

200 మందికిపైగా క్రియేటర్ల హాజరు

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఇన్‌స్టా మీ ట్ 8.0 విజయవంతంగా నిర్వహించబడిం ది. హైదరాబాద్ ఫుడ్ డైరీస్ ద్వారా విస్తృత గుర్తింపు పొందిన ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ మొహమ్మద్ జుబైర్ అలీ స్థాపించిన ఈ వేదిక గత ఏడేళ్లుగా డిజిటల్ క్రియేటర్లకు బలమైన అనుసంధాన కేంద్రంగా మారింది. ఈ ఏడాది ఎడిషన్‌ను నానక్‌రామ్‌గూడలో ని బాబిలోన్ బ్రూవరీ, క్లబ్ వేదికగా నిర్వహించగా, 200 మందికిపైగా బ్లాగర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు హాజరయ్యారు.

ఆరంభంలో ఫుడ్ కంటెంట్‌కే పరిమితమైన హైదరాబాద్ ఇన్‌స్టా మీట్ ఇప్పుడు ఫ్యాషన్, లైఫ్‌సైల్, పేరెంటింగ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ట్రావె ల్ వంటి విభిన్న విభాగాల క్రియేటర్లను కలిపే స్థాయికి చేరుకుంది. ఇది హైదరాబాద్ ఇన్ఫ్లూయెన్సర్ ఎకోసిస్టమ్ వేగంగా ఎదుగుతున్న తీరును స్పష్టంగా చూపిస్తోంది. గత ఏడేళ్ల కాలంలో హైదరాబాద్ ఇన్‌స్టా మీట్ 70కి పైగా బ్రాండ్లతో కలిసి పనిచేసింది.