మాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
వీసా విజన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ రఘువీరారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థులను నమ్మించి తాము మోసం చేయలేదని మూసారాంబాగ్‌లోని వీసా విజ న్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ రఘువీరారెడ్డి తెలిపారు. సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘువీరారెడ్డి నిజ నిజాలను వెల్లడించారు. విద్యార్థు లు తమ సంస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
అనతి కాలంలో తమ కన్సల్టెన్సీ ఎంతో మంచి గుర్తింపు సాధించిందని, దానిపై బురదచల్లేందుకు సమాజంలో అభాసుపాలు చేసేందుకు, అమీర్‌పేట్‌లోని ఓ కన్సల్టెంట్ సంస్థ నిర్వాహకులు విద్యార్థులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తమ సంస్థలో చదివిన మొదటి బ్యాచ్ 15 మంది విద్యార్థులు తమ కు ఆరోగ్యం పరిస్థితిలో బాగా లేవని, తాము తిరిగి ఇనిస్ట్యూట్ కి రాలేకపోతున్నామని, చె ప్పి అమీర్‌పేట్‌లోని ఓ కన్సల్టెన్సీలో చేరారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధా రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తాము ఎవరిని మభ్య పెట్టలేదని తమ సంస్థలో చేర్చుకోలేదని, త్వరలో నిజాలు విద్యార్థులు తెలుసుకుంటారని రఘువీరారెడ్డి తెలిపారు.






