calender_icon.png 11 January, 2026 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌లో ధర్మభిక్షం విగ్రహ ప్రతిష్టాపన

11-01-2026 12:00:00 AM

వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ 

ఎల్బీనగర్, జనవరి 10 : ఎల్బీనగర్ చౌరస్తాలో  బహుజన వీరుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన  వాల్ పోస్టర్లను శనివారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మాజీ మధుయాష్కీగౌడ్ ఆవిష్కరించారు. త్వరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆవిష్కరిస్తామని విగ్రహా నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్,  మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామారావు, రేణు గౌడ్, ప్రజ్ఞ శీను తదితరులు పాల్గొన్నారు.