11-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
మణికొండ, జనవరి 10 (విజయక్రాంతి): కాకతీయ సేవా సమితి మణికొండ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. వీరితో పాటు కె.సత్యనారాయణ, రాజేష్, శ్రీనివాసరావు, అంకమ్మ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కాకతీయ సేవా సమితి గతంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షుడు కమ్మ బ్రహ్మాజీ, కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.