23-05-2025 02:02:46 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, మే 22 (విజయక్రాంతి): విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు మన సాంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం.సంజ య్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఓల్ హై స్కూల్లో జరుగుతున్న ఐదు రోజుల ఉపాధ్యాయు ల వృత్యాంతర శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బా నిసలు కాకుండా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కోరారు.
సిలబస్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని వారు కోరారు. పాఠశాల మౌ లిక సదుపాయాల విషయంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, జగిత్యాల అర్బన్ మండల విద్యాధికారి చంద్రకళ, రిసోర్స్ పర్సన్స్ సిహెచ్ పి. శ్రీనివాస్, కృష్ణ సాయి, రాజకుమార్, చంద్రశేఖర్, జగదీశ్వర్, దేవేందర్ రెడ్డి, పీఆర్టీయుటిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు బోయిని పెల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.