calender_icon.png 23 May, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్వ పూడికతీత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి

23-05-2025 02:04:47 AM

సుల్తానాబాద్, ఓదెల, మే -22 (విజయ క్రాంతి): జిల్లాలో ఉన్న కాలువల పూడికతీత పనులు ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టి పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం సుల్తానాబాద్  మండలంలోని సుద్దాల గ్రామం లో, ఓదెల మండల కేంద్రం లో  ఉన్న ఎస్సారెస్పీ కాలువలను జిల్లా కలెక్టర్ పరిశీలించా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూసుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో కాల్వలను  వర్ష కాలం లోగా మే యిన్ కేనాల్ తో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా పూర్తి స్థాయిలో శుభ్రం చేయా లని, రాబోయే 20 రోజుల లోగా కాల్వల ప నులు పూర్తి చేయాలని, అనంతరం  ఓదెల మండలంలో ఉన్న దాదాపు 40 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాలువలు, ఇతర నీటిపారుదల కాలువలు పూడికతీత, చెత్త తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని, అవసరమైన చోట కాల్వ మరమ్మత్తు పనులు కూడా చేయాలని,గ్రామాలలో ఉపాధి హా మీ కూలీలను అధిక సంఖ్యలో నియమించి వర్షాకాలం లోపు కాల్వ పూడికతీత పనులు పూర్తి చేయాలని, కాల్వ చివరి ఆయకట్టు వరకు నీటి ప్రవాహం చేరుకునేలా పనులు జరగాలన్నారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, సుల్తానాబాద్ ఎంపీడీవో ది వ్య దర్శన్ రావు,  ఓదెల ఎంపీడీవో తిరుప తి, ఎంపీ ఓ షబ్బీర్, ఏపిఓ రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.